Center allows three new medical colleges in AP
Center allows
three new medical colleges in AP
ఆంధ్రప్రదేశ్ లో
కొత్తగా మూడు వైద్య కళాశాలలకు
కేంద్రం అనుమతి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మూడు కాలేజీలకు
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య
శాఖ కార్యదర్శి అమిత్ బిశ్వాస్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు. పాడేరు,
గురజాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు
అనుమతించారు. ఒక్కో కళాశాలకు రూ. 325 కోట్ల వ్యయం అవుతుందని
అంచనా వేయగా ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తుంది. ఈ లెక్కన ఒక్కో కళాశాలకు కేంద్రం నుంచి రూ. 195 కోట్ల నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 130
కోట్లు వ్యయం చేస్తుంది.
You may also like these Posts
0 Komentar