Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India Post Office Recruitment 2026: Apply for 28,636 GDS Posts (Schedule-1, Jan 2026) – Details Here

 

India Post Office Recruitment 2026: Apply for 28,636 GDS Posts (Schedule-1, Jan 2026) – Details Here

తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు (షెడ్యూల్-1, జనవరి 2026) – జీత భత్యాలు: నెలకు రూ.10,000 - రూ. 29,380

===================

UPDATE 07-03-2026

India Post Office Recruitment 2026:

జీడీఎస్ (షెడ్యూల్-1, జనవరి 2026) మొదటి జాబితా (List I) ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 28,636 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-1, జనవరి 2026) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ లో 1060 పోస్టులు, తెలంగాణలో 608 పోస్టులు చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు మార్చి 23 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ గా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ మొదటి జాబితా

తెలంగాణ జీడీఎస్ మొదటి జాబితా

WEBSITE

MAIN WEBSITE

 ===================

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 28,636గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-1, జనవరి 2026) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 14 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామీణ డాక్ సేవక్స్: బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ / డాక్ సేవక్:

తెలుగు రాష్ట్రాల సర్కిల్ లో ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్- 1060, తెలంగాణ- 608

మొత్తం ఖాళీల సంఖ్య: 28,636

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ కు / డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.

వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిల్లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 31.01.2026 - 14.02.2026

ఆన్లైన్ దరఖాస్తుల తేదీలు: 02.02.2026 - 16.02.2026.

దరఖాస్తు సవరణల తేదీలు: 18.02.2026 - 19.02.2026

=====================

NOTIFICATION

INSTRUCTIONS

VACANCY LIST

REGISTER

WEBSITE

MAIN WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags