Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Employee Service Rules: SURRENDER LEAVES

ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules)
ఆర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో:
అర్జితసెలవు(Earned Leave) ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను 'సరెండర్ లీవ్' అందురు.
(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)
(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969)
* ఇట్టి సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
* ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం (ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.
(G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)
* సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే.
(G.O.Ms.No.306 Fin తేది:08-11-1974)
* సం॥ నకు 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు.
(G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)
* సరెండర్ లీవ్ కాలానికి పూర్తివేతనం, ఇతర అలెవెన్సులు మంజూరు చేయబడును. IR చెల్లించ బడదు.
(Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)
* సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు. ఈ సెలవు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.
(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)
* ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరు చేయు అధికారం కలిగి ఉంటారో అట్టి అధికారే ఆర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించ వచ్చును.
(Para ii of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)
* అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదినుండి మాత్రమే, అర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేది నుండి అనుమతించకూడదు.
(Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)
* జనవరి 1వ తేదిన గాని,జూలై 1వ తేదీన గాని అర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అర్జిత సెలవు ఖాతాలోంచి ముందుగా సరెండర్ సెలవు తగ్గించి ఆ తర్వాతే అర్జిత సెలవు జమలు నమోదు చేయాలి.
(Govt.Memo.No.50978/1063/FR-I/79-1 తేది:22-11-1979)
* అర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో నుంచి GPF, ప్రభుత్వానికి చెల్లించే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరములు తగ్గించకూడదు.
* సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె (HRA) మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సు లు కూడా చెల్లించాలి.
(Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)
* ప్రభుత్వ క్వార్టర్ లలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ సెలవు జీతంతో HRA పొందుటకు అర్హులు.
(G.O.Ms.No.337 Fin తేది:29-09-1994)
* పదవీ విరమణ తేదికి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరు చేయవచ్చును. కాని అట్టివారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి, పదవీ విరమణ తేదికి డ్యూటీ పీరియడ్ కు 30 రోజులు తక్కువ గాకుండా ఉండ వలెను.
(G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)
* పదవీ విరమణ/సర్వీసులో ఉంటూ మృతి చెందిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవును నగదుగా మార్చుకొను విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును.
(Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 Fin తేది:31-01-1977)
* సరెండర్ సెలవు మంజూరైన తేదినుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కోసం సమర్పించాలి.  సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది.
(Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)
* అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తి వివరములు ఉత్తర్వుల నంబరుతో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్రసిరాతో నమోదుచేయాలి. అలాగే సర్వీసు పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఎర్రసిరాతో నమోదుచేసి అటెస్ట్ చేయాలి.
Previous
Next Post »
0 Komentar