Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Beware of bikes and cars

బైక్ , కార్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి
లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలను రోజుల తరబడి బయటకు తీయకపోవడం వల్ల బ్యాటరీలే మొదట దెబ్బతింటాయి. రోజుల తరబడి వాహనాలు నడపకపోవడం వల్ల బ్యాటరీలు చెడిపోయి త్వరగా డిశ్చార్జి అవుతాయి. కొత్త వాహనాల్లో ఈ ఇబ్బంది వెంటనే రాకున్నా ఏడాది కంటే ఎక్కువ వినియోగంలో ఉన్న వాటిలో ఈ ఇబ్బందులొస్తాయి.
*కుదిరితే రోజూ కొద్దిసేపు బండి బయటకు తీయాలి. కుదరక పోతే కనీసం ఇంజన్‌ స్టార్ట్‌ చేసి కొద్దిసేపు అలాగే ఆన్‌లో ఉంచాలి.
*ఇంజన్, బ్యాటరీ, బ్రేకులు, టైర్లు, ఇంధన సంరక్షణ అంశాల పనితీరును పరిశీలించాలి. 
*రోజూ వాహనాన్ని శుభ్రంగా తుడవడం వల్ల తప్పు, మరకలు పట్టవు.
* కార్ల బాయినెట్‌లోకి ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలు చేరవచ్చు. ఇవి ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌లో వైర్లను తెంచేసే ప్రమాదం ఉంది. 
*బైక్‌ల్లో పెట్రోల్‌ ఆఫ్‌లో ఉంచాలి. వాహనం బయటకు తీయనప్పుడు ఆన్‌లో ఉంచడం వల్ల ఇంధనం ఓవర్‌ఫ్లో అయ్యే ప్రమాదం ఉంది.
బ్యాటరీ ఆధారిత వాహనాలను రోజూ కొద్దిసేపైనా బయటకు తీయాలి. 
*ద్విచక్ర వాహనాలను స్టార్ట్‌ చేసేటపుడు మొదట సెల్ఫ్‌ స్టార్ట్‌ కంటే కిక్‌ స్టార్ట్‌ను ఉపయోగించాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags