Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE and NEET exam decision tomorrow from NTA, says HRD Minister

JEE and NEET exam decision tomorrow from NTA, says HRD Minister

రేపు జేఈఈ, నీట్‌ పరీక్షలపై ఎన్‌టీఏ నిర్ణయం: హెచ్‌ఆర్‌డీ మంత్రి
జూలైలో జరగాల్సిన జేఈఈ , నీట్ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ట్విట్టర్‌ ద్వారా డిమాండ్‌ చేశారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం తెలిపారు. పరిస్థితిని సమీక్షించి, వారి సిఫారసులను రేపటిలోగా సమర్పించాలని ఎన్‌టీఏ, ఇతర నిపుణులతో కూడిన కమిషన్‌ను కోరినట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రి గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  విపరీతంగా పెరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై  మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వ్యక్తులు ట్విట్టర్‌లో #RIPNTA అనే ​​హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. 24 గంటల్లో 314800 కంటే ఎక్కువమంది దీనిని  రీట్వీట్ చేశారు. దీంతో ఇది టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లో నిలిచింది . దీనిపై స్పందించిన  హెచ్‌ఆర్‌డీ మంత్రి "మీ సమస్యలను నేను అర్థం చేసుకున్నాను, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనటానికి మేము ప్రయత్నిస్తున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా జేఈఈ పరీక్ష జూలై 19-23 మధ్య జరగాల్సి ఉండగా, నీట్ పరీక్ష జూలై 26 న జరగాల్సి ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags