Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE 10, 12 Supplementary Examinations from Sep 22

CBSE 10, 12 Supplementary Examinations from Sep 22
22 నుంచి సీబీఎస్ఈ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలు
సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు జరగనున్నాయి. వీటితో పాటు మార్కులు మెరుగుపరచుకోవాలనుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనుంది. కొవిడ్-19 నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లను సొంతంగా తీసుకురావాలని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కరోనా నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులో సీబీఎస్ఈ తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సురక్షిత చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది. కేసును కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags