Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RIE Seats filling with Inter and Degree marks - RIE CEE canceled this time due to corona


RIE Seats filling with Inter and Degree marks - RIE CEE canceled due to corona
ఇంటర్‌, డిగ్రీ మార్కులతో ఆర్‌ఐఈల్లో సీట్ల భర్తీ - కరోనా కారణంగా ఆర్‌ఐఈ సిఈఈ రద్దు

అక్టోబరులో బీఈడీ, ఎంఈడీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ
మైసూరు ఆర్‌ఐఈలో ఏపీతెలంగాణ విద్యార్థులకు ప్రతేక కోటా ఇస్తారు.

ఇంజినీరింగ్‌కు ఐఐటీలు.. ఫార్మసీకి నైపర్లు.. మేనేజ్‌మెంట్‌ విద్యకు ఐఐఎంల మాదిరిగా ఉపాధ్యాయ విద్యకు జాతీయ స్థాయిలో పేరొందిన రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఆర్‌ఐఈ) సంస్థల్లో ఈసారి ఇంటర్‌/డిగ్రీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. ఏటా దేశవ్యాప్తంగా ఆర్‌ఐఈ సిఈఈ పేరిట ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇచ్చి బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఎంఈడీ లాంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేవారు. ఈసారి కరోనా కారణంగా ప్రవేశ పరీక్షను నిర్వహించరాదని అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలకు ఇంటర్, బీఈడీకి డిగ్రీ, ఎంఈడీకి బీఈడీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ చేయనున్నారు. అందుకు అక్టోబరు మొదటి వారంలో దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దేశవ్యాప్తంగా మైసూరు, భువనేశ్వర్, భోపాల్, అజ్మీర్, షిల్లాంగ్‌లలో ఆర్‌ఐఈలున్నాయి. అవన్నీ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పరిధిలో పనిచేస్తాయి. వాటిల్లో బీఏ-బీఈడీ, బీఎస్‌సీ-బీఈడీ(4 సంవత్సరాలు), బీఈడీ(రెండేళ్లు), ఎంఎస్‌సీ-బీఈడీ(6 సంవత్సరాలు), ఎంఈడీ(రెండేళ్లు) కోర్సులున్నాయి. మైసూరు ఆర్‌ఐఈలో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు ప్రతేక కోటా ఇస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags