Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Special trains for UPSC Civils exam



Special trains for UPSC Civils exam
UPSC సివిల్స్‌ పరీక్షకు ప్రత్యేక రైళ్లు.. రూట్‌మ్యాప్‌ ఇదే..!
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఓడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఓడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్‌ 4 తేదీన పరీక్ష నిర్వహిస్తుండటంతో ముందు రోజు ఈ రైళ్లు నడిపేందుకు శనివారం ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయం తీసుకుంది. 

ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 3 న బెర్హాంపూర్, కియోంజార్, ఖరియార్ రోడ్, ఇచ్ఛాపురం నుంచి సాయంత్రం 4 గంటలకు, కోరాపుట్ నుంచి ఉదయం 5 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరనున్నాయి. కాగా ఈ రైళ్లు అదే రోజు సాయంత్రం తిరిగి నగరాలకు చేరుకోనున్నాయి.

అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కోరాపుట్-కటక్, కోరాపుట్-విశాఖపట్నం, రూర్కెలా- కటక్, జారుసగూడ, బారిపాడ-కటక్ మరియు విజయవాడ- విశాఖపట్నం మధ్య పరీక్షా ప్రత్యేక రైళ్లను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నడుపుతుంది. కాగా మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్‌ పరీక్ష కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

అక్టోబరు 4న జరగనున్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రం నుంచి 30,199 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో 68 కేంద్రాల్లో జరిగే పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

పరీక్షలకు జిల్లా కలెక్టర్లు సమన్వయ పర్యవేక్షకులుగా ఉంటారు. విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల్లో ఇద్దరేసి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఒక్కో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని పరిశీలకులుగా నియమించారు. 

ఉదయం 9.30 గంటల నుంచి 11.30గంటలు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండు విడతలుగా పరీక్ష ఉంటుంది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని, అభ్యర్థుల మధ్య భౌతికదూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags