Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

To prevent Cancer in children at an early age - Parents must take these 9 precautions.!




To prevent Cancer in children at an early age .. Parents must take these 9 precautions.!
చిన్నతనంలోనే పిల్లలకు “కాన్సర్” రాకుండా ఉండాలంటే..తల్లితండ్రులు ఈ 9 జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.! 
క్యాన్సర్  అదిప్పుడు మహమ్మారిలా మారి ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటుంది.. ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాదపడుతూనే ఉన్నారు..ఇక ఆ వ్యాదితో బాదపడడమే ఓ నరకం అంటే ట్రీట్మెంట్ ఇంకా నరకప్రాయం..చిన్నపిల్లలు కూడా ఎక్కువశాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులు తీసుకునే కొన్ని జాగ్రత్తలు పిల్లల్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడగలుగుతాయి .అవేంటో తెలుసుకోండి.

1. చిన్ననాటి నుండి ప్రతివిషయంలో తల్లిదండ్రులనే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు.కావున తల్లిదండ్రులే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని దూరంగా పెట్టి ఇలాంటి అలవాట్లు అన్నింటిని చిన్న వయస్సు నుండే పిల్లలకు అలవాటు చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల భారిన పడకుండా కాపాడుకోవచ్చు.

2. ధూమపానం చేసేవారితో పాటు,పక్కనుండి పీల్చిన వారికి కూడా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.ఇంట్లో వారికి సిగరెట్ అలవాటున్నటైతే పిల్లలకు క్యాన్సర్ సోకే అవకాశాలెక్కువ కాబట్టి వీలైనంత వరకు ఆ అలవాటుని మార్చుకోవడం మంచిది.లేదంటే మన పిల్లల ఆరోగ్యం మనమే చేతులారా పాడుచేసినవారమవుతాం.

3. ఈ రోజుల్లో పిల్లలకు తల్లిపాలు పట్టటం చాలా తగ్గిపోయింది.డబ్బాపాలకే అందరూ మొగ్గు చూపుతున్నారు.కొందరు ఆర్నెళ్లు,ఏడాది పాటు ఇచ్చి ఆపేస్తుంటారు.కాని రెండు నుండి మూడేండ్లవరకు పిల్లలు తల్లిపాలు తాగినట్టైతే వారి రోగనిరోధక శక్తి పెరిగి వారిని క్యాన్సర్ భారిన పడకుండా చేస్తుందట.

4. పిల్లలు కలర్ఫుల్ ఆహారపదార్ధాలకు అట్రాక్ట్ అవుతారు.ముఖ్యంగా మార్కెట్లో దొరికే రంగురంగుల ప్యాకెట్లలోని తినుబండారాలను ఇష్టపడతారు.వారి కడుపునింపడానికి ఏదో ఒకటిలే అన్నట్టుగా తల్లిదండ్రులు వాటిని ఎంకరేజ్ చేస్తారు.కాని అది మంచి పద్దతి కాదు. తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆహారపు అలవాట్లను పర్యావేక్షించడం మంచిది. వారు అవసరమైన మేర ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు మరియు పాలను తీసుకునేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వారియొక్క శరీరాలు ఆరోగ్యవంతంగా తయారయ్యి క్యాన్సర్ కణాల పై పోరాడతాయి.

5. సాధ్యమైనంత వరకు పిల్లలను కాలుష్యానికి దూరంగా ఉంచండి. ఎందుకంటే, కాలుష్యం లో ఉండే హానికరమైన పదార్ధాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు చర్మ క్యాన్సర్ వంటివి పిల్లల్లో అధికంగా వస్తున్నాయి. మీకు గనుక వీలయితే వారిని తక్కువ కాలుష్యం ఉండే ప్రాంతాల్లో ఉంచండి.

6. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అనే కొవ్వు కు సంబంధించిన ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తాయి. ఈ లాభాలతో పాటు అది శరీర బరువుని తగ్గిస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరంలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందకుండా మరియు రెట్టింపు అవ్వకుండా నిరోధిస్తుంది. కాబట్టి, మీ పిల్లలు తినే ఆహారంలో క్రమం తప్పకుండా వాల్ నట్స్,కొబ్బరి నూనె, నెయ్యి మొదలగునవి ఉండేలా చూసుకోండి.

7. ప్రస్తుతకాలంలో పెద్దలు గాడ్జెట్స్ కు దూరంగా ఉండాలి అంటే అంత సులభమైన పనికాదు. ఎందుకంటే, వాటితోనే పనిచేయవలసి ఉంటుంది మరియు రోజూచేసే మిగతా పనులు కోసం కూడా అవి అవసరం అవుతాయి. అయితే పిల్లలు సాధారణంగా వీటిని ఆడుకోవాలనే ఉద్దేశ్యంతోనే తీసుకుంటారు. ఎప్పుడైతే పిల్లలు సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు కంప్యూటర్లు ఎక్కువగా వాడటం మొదలు పెడతారో అటువంటి సమయంలో కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉందట. కాబట్టి సాధ్యమైనంత వరకు మరీ అవసరమైతే తప్ప ఈ గాడ్జెట్స్ పిల్లలకు ఇవ్వకండి.

8. చాలా మంది పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు విపరీతమైన ఇన్ఫెక్షన్ల భారినపడుతుంటారు మరియు జలుబు, పళ్ళ ఇన్ఫెక్షన్లు మొదలగు వ్యాధుల భారిన తరచూ పడుతూ ఉంటారు. ఎందుకంటే, చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఇంకా వృద్ధి చెందే దశలోనే ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు ఈ వ్యాధుల భారిన పడతారో అటువంటి సమయాల్లో యాంటీ బయాటిక్స్ ని వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే, యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది మరియు శరీరంలో క్యాన్సర్ కారక కణాలు చాలా సులభంగా పెరిగిపోతాయి.

9. చిన్నపిల్లలు గనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే, క్యాన్సర్ తో పాటు మరెన్నో రకాల వ్యాధులను రాకుండా నిరోధించవచ్చు మరియు అరికట్టవచ్చు. కాబట్టి, పిల్లలను వాళ్లకు ఇష్టమైన ఆటల్లో చేర్పించండి లేదా వారు కోరుకునే వ్యాయామాన్ని నేర్పించండి. ఇలా చేయడం వల్ల బాల్యంలో క్యాన్సర్ రాకుండా సాధ్యమైన మేర అరికట్టవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags