Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DA along with a November salary

 

DA along with a November salary

నవంబరు జీతంతో పాటు ఒక డీఏ

 

- ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం అన్న సజ్జల

- ముఖ్యమంత్రి సూచన మేరకే సమావేశాలు

- ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని గట్టిగా అడిగాం

- కె ఆర్ సూర్యనారాయణ వెల్లడి

 

ఉద్యోగులకు అంత ఆశాజనకమైన సమాచారం ఏమీ లేదు. ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక్క  డీ ఏ మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా  ఉందని చెప్పింది.

 

నవంబరు నెల జీతంతో పాటు డిసెంబర్లో ఒక డీ ఏ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు.  ప్రధానంగా రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని ఈ సమావేశంలో ఆయన నేతలకు వివరించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకే తాను ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు . వీటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సూర్యనారాయణ చెప్పారు. ఆయన డిమాండ్లు  ఇవి...

 

- రెండు డీఏలు కచ్చితంగా ప్రకటించాల్సిందే

- పీ ఆర్ సీ తక్షణమే అమలుచేయకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది, వెంటనే అమలుకు ప్రయత్నించాలి

- రిటైరైన ఉద్యోగుల బకాయిలు తక్షణమే అమలు చేయాలి

- కోవిడ్ వల్ల నిలిపివేసిన సగం జీతాలు తక్షణమే ఇవ్వాలి

- సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్

Previous
Next Post »
0 Komentar

Google Tags