Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DOST 2020: Phase-3 registration deadline extended


DOST 2020: Phase-3 registration deadline extended
దోస్త్ 2020: దోస్త్‌ ఫేజ్‌-3 రిజిస్ట్రేషన్‌ గడువు పెంపు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే..?
డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ)‌ మూడో విడత రిజిస్ట్రేషన్‌ గడువును పొడిగించారు.

ఫేజ్‌-3 రిజిస్ట్రేషన్‌ గడువు 9 వరకు పొడిగింపు
వెబ్‌ ఆప్షన్ల గడువు 10వ తేదీ వరకు
అక్టోబరు 15 నుంచి ప్రత్యేక విడత ప్రారంభం

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ)‌ మూడో విడత రిజిస్ట్రేషన్‌ గడువు అక్టోబరు 6తో ముగియనుండగా దాన్ని 9వ తేదీ వరకు పొడిగించారు. వెబ్‌ ఆప్షన్ల గడువు 10వ తేదీ వరకు ఉంటుంది. సీట్లను 15వ తేదీన కేటాయిస్తారు. వివరాలు https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మూడో విడత పూర్తయిన తర్వాత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో విడత ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నామని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. అందుకు అక్టోబరు 15 నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని.. 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వారికి అక్టోబరు 30వ తేదీన సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags