Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

829 Teachers And 575 Students Tests Coronavirus in Andhra Pradesh After Schools Re-Open

 


829 Teachers And 575 Students Tests Coronavirus in Andhra Pradesh After Schools Re-Open

ఏపీ స్కూళ్లలో కరోనా పంజా.. 829 మంది టీచర్లు, 575 మంది విద్యార్థులకు వైరస్

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది.. వరుసగా కేసులు నమోదు కావడం టెన్షన్ పెడుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న టీచర్లు, విద్యార్థుల సంఖ్య మెల్లిగా పెరుగుతోంది. 

ఏపీలో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరవుతున్నారు.. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు వస్తున్నారు.. స్కూళ్లలో జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది.. వరుసగా కేసులు నమోదు కావడం టెన్షన్ పెడుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న టీచర్లు, విద్యార్థుల సంఖ్య మెల్లిగా పెరుగుతోంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 70,790 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా వీరిలో 829 మందికి పాజిటివ్‌గా తేలింది. 95,763 మంది విద్యార్థులను పరీక్షించగా 575 మందికి వైరస్ ఉంది. చిత్తూరు జిల్లా బీఎన్‌కండ్రిగ మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దినేష్‌ కరోనాతో చెన్నై ఆసుపత్రిలో మరణించారు. 

సెప్టెంబరు 22 నుంచి 9, 10 తరగతి విద్యార్థులను స్కూళ్లకు అనుమతించారు. తల్లిదండ్రుల అనుమతి పత్రంతో రావొచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో విద్యార్థులు వెళ్తున్నారు. విద్యార్థులు, టీచర్లు వేర్వేరు చోట నుంచి స్కూళ్లకు వస్తుండటంతో పాటూ దగ్గరగా ఉండటం.. కొన్ని అజాగ్రత్తలతో కరోనా బారిన పడుతున్నారు. ఈనెల 2 నుంచి పూర్తిస్థాయిలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. టీచర్లకు కరోనా పరీక్షలు తప్పనిసరి కావడంతో వారు పరీక్షలు చేయించుకుని అధికారులకు రిపోర్టులు అందిస్తున్నారు. ఒకవేళ ఈ టెస్టుల్లో ఎవరికైనా పాజిటివ్ తేలితే మిగతావారు టెన్షన్ పడాల్సి వస్తోంది. ఇటు మధ్యాహ్న భోజనం వండే కార్మికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags