Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: RGUKT Second Phase Counselling from Nov 24

 


TS: RGUKT Second Phase Counselling from Nov 24

టి‌ఎస్: 24 నుంచి ఆర్జీయూకేటీ రెండో విడత కౌన్సెలింగ్‌

నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యాలయ రెండో విడత కౌన్సెలింగ్‌ను నవంబరు 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితాను విద్యాలయం న‌వంబ‌రు 12న‌ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించకపోవటంతో మొదటి విడతలో 237 సీట్లకు సంబంధించి (ఆంధ్ర-తెలంగాణ ఉమ్మడి ఎంపిక) జాబితాను విడుదల చేయలేదు. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం గ్రేడ్లను వెల్లడించకపోవడంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవుతుందని భావించి తాజాగా తెలంగాణ విద్యార్థులతో కూడిన రెండో విడత జాబితాను ప్రకటించారు. 237 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని విద్యాలయం సమాచారం అందించింది. గ్లోబల్‌ కేటగిరీలో భర్తీకాని సీట్ల స్థానంలో సాధారణ విద్యార్థులకు నవంబరు 25వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ మేరకు 278 మంది విద్యార్థులతో కూడిన మరో జాబితాను విద్యాలయం విడుదల చేసింది.

WEBSITE

Admissions-2020 - Provisionally Selected Candidates for Phase-II Counselling

List of Candidates Provisionally Shortlisted for unfilled seats of Global category

Previous
Next Post »
0 Komentar

Google Tags