Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC CHSL 2020-21: 4726 Vacancies – Apply Before 15 December

 

SSC CHSL 2020-21:  4726 Vacancies – Apply Before 15 December

ఇంటర్‌ పాసైన వారికి 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్‌డీసీ, పీఏ, డీఈఓ పోస్టుల భర్తీకి సీహెచ్‌ఎస్‌ఎల్‌ నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4726 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే చిన్న వయసులోనే కేంద్ర కొలువులను సొంతం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం. 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.‌ దరఖాస్తులు ఈనెల 15 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 

పరీక్ష విధానం:

ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. టైర్‌-1లో 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో అర్హత సాధించినవారిని టైర్‌-2కు, అందులో క్వాలిఫై అయినవారిని టైర్‌-3కి ఎంపిక చేస్తారు. 

మొత్తం పోస్టులు: 4726

లోయర్‌ డివిజనల్‌ క్లర్క్ (ఎల్‌డీసీ) లేదా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ)- 1538 పోస్టులు

పోస్టల్‌ అసిస్టెంట్‌ (పీఏ) లేదా సార్టింగ్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)- 3181

డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈఓ)- 7 

ముఖ్య సమాచారం:

అర్హత: ఎల్‌డీసీ లేదా జేఎస్‌ఏ, పీఏ లేదా ఎస్‌ఏ డీఈఓ పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కాగ్‌లో డీఈఓ పోస్టుకు ఇంటర్‌లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులు చదివి ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్‌ ఫీజు: రూ.100

ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివ‌రి తేది: డిసెంబర్‌ 17, 2020 (11.30PM)

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 15, 2020

టైర్‌-1 పరీక్ష: 2021 ఏప్రిల్‌ 12 నుంచి 27 వరకు

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/ 

How to Apply: 10.1 Applications must be submitted in only online mode at the official website of SSC Headquarters i.e., https://ssc.nic.in For detailed instructions, please refer to Annexure-III and Annexure-IV. Sample proforma of One-time Registration and online Application Form are attached as Annexure-IIIA and Annexure-IVA respectively. 

ADDENDUM SSC_CHSLE_08.12.2020

IMPORTANT NOTICE 08.12.2020

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags