Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IAF Group C Recruitment 2021: Indian Air Force Invites Applications For 257 Vacancies

 

IAF Group C Recruitment 2021: Indian Air Force Invites Applications For 257 Vacancies

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో 257 జాబ్స్‌ - టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు 

మొత్తం 257 గ్రూప్‌-సీ జాబ్స్‌

మార్చి 13 దరఖాస్తులకు చివరితేది 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF).. 257 గ్రూప్‌-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 13 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

అర్హతలు:

ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఇక వేతనం విషయానికొస్తే.. లెవెల్ -1 పోస్టులకు రూ.18,000, లెవెల్- 2 పోస్టులకు రూ.19,900, లెవెల్-4 పోస్టులకు రూ.25,500 ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత నోటిఫికేషన్‌లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. 

ముఖ్య సమాచారం:

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 11, 2021

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 13, 2021

పరీక్ష తేదీ: ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు.

వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags