Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఆ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష!

 

ఆ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష!

సమాచార మార్పిడికి భాష ఒక మాధ్యమం. ఇది నిరంతరం పరివర్తనం చెందుతూ సరికొత్తగా ఉద్భవిస్తుంది. కొన్నిసార్లు ఇతర భాషల నుంచి కొన్ని పదాల కలయికతో నూతనంగా మారుతుంది. మహారాష్ట్రలోని కోర్లాయ్‌ గ్రామంలో ఇలాంటి మార్పే కనిపించింది. ఈ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష వాడుకలో ఉంది. ఇక్కడి ప్రజలు మరాఠీ భాషతో పోర్చుగీసును కలిపి మాట్లాడతారు.

పోర్చుగీసు మూలాలున్న వంశాలు గత 700 ఏళ్ల నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. ఇప్పటికీ 250 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి వృద్ధులు తమ రోజువారీ సంభాషణలో పోర్చుగీసు భాషనే వినియోగిస్తారు. వృద్ధుల ద్వారా నేటితరం యువకులూ ఈ భాషనే మాట్లాడుతున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags