Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Intermediate Board Released Model Question Papers for Inter Exams 2021

 

TS Intermediate Board Released Model Question Papers for Inter Exams 2021

టి‌ఎస్: ఇంటర్ మోడల్‌ పేపర్స్ విడుదల

ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. 

అన్నీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో మార్పులు

అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు 

కోవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు మూతబడిన నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ మేర‌కు ఇంట‌ర్ మోడ‌ల్ పేప‌ర్స్‌ను ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. అన్ని స‌బ్జెక్టుల ప్ర‌శ్నాప‌త్రాల్లో మార్పులు చేసిన‌ట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

రెండు మార్కుల ప్ర‌శ్న‌లు ప‌దింటికి ప‌ది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్ర‌శ్న‌ల్లో మార్పులు చేశారు. మోడ‌ల్ పేప‌ర్స్ కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్‌ పరీక్షలయిన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను ఏప్రిల్‌ 1, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags