Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 26-03-2021

 

AP Covid-19 Media Bulletin 26-03-2021

ఏపీలో 984 కొత్త కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 40,604 నమూనాలను పరీక్షించగా 984 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,96,863 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,203కు చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 306 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,49,16,201 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.




Previous
Next Post »
0 Komentar