AP Covid-19 Media Bulletin 28-03-2021
ఏపీలో వెయ్యి దాటిన కొత్త కరోనా
కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,005 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,98,815 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ బారినపడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,205కు చేరింది.
గడిచిన 24
గంటల వ్యవధిలో 324 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర
వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,86,216కి
చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,394 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,90,039 కరోనా నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 225..
అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 13 కేసులు
నమోదయ్యాయి.
0 Komentar