Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICAI May 2021 Exam Schedule for CA Intermediate and CA IPCC

 

ICAI May 2021 Exam Schedule for CA Intermediate and CA IPCC   

ఐ‌సి‌ఏ‌ఐ మే-2021 సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది నిర్వహించబోయే సీఏ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ఐపీసీ గ్రూప్-1 పరీక్షలు కొత్త, పాత విధానాల కింద మే 22, 24, 27, 29 తేదీల్లో జరగనున్నాయి. గ్రూప్-2 పరీక్షలు మే 31, జూన్ 2, 4 తేదీల్లో కొనసాగుతాయి. గ్రూప్-2 పరీక్ష పాత విధానంలో జూన్ 6న కొనసాగనుంది.

ఫైనల్ కోర్సు గ్రూప్-1 పరీక్షలు మే 21, 23, 25, 28, గ్రూప్-2 పరీక్షలు మే 30, జూన్ 1, 3, 5 తేదీల్లో జరుగుతాయి. ఇన్స్యూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్ టెక్నికల్ పరీక్షలు మాడ్యూల్ 1-4 పరీక్షలు మే 21, 23, 25, 28 తేదీల్లో కొనసాగుతాయి. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసెస్మెంట్ టెస్ట్ మే 21, 23 తేదీల్లో ఉంటుంది. అన్ని పరీక్షలూ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో ఉంటాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags