Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE MAIN 2021 March Session Registration Now Open

 

JEE MAIN 2021 March Session Registration Now Open

జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం 

జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ పరీక్షను మార్చి 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది.

దరఖాస్తుకు మార్చి 6 ఆఖరు తేది

మార్చి 15 నుంచి 18 వరకు పరీక్షలు 

జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు మార్చి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే మార్చి/ఏప్రిల్/మే సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సెషన్/కేటగిరీ/సబ్జెక్టును మార్చుకోవచ్చని తెలిపింది. 

మార్చి 6 తర్వాత ఆ అవకాశం ఉండదని తెలిపింది. జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ పరీక్షను మార్చి 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది.

ఇలా రిజిస్టర్‌ చేసుకోండి:

మొదటగా http://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

తర్వాత JEE Main March 2021 session-Fill Registration లింక్ పై క్లిక్ చేయాలి.

అనంతరం పేరు, విద్యార్హతలు, తదితర వివరాలను నమోదు చేయాలి.

ఫొటో, సంతకం స్కానింగ్ ఇమేజ్ లను అప్ లోడ్ చేయాలి.

తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

చివరిగా కర్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని దాచుకోవాలి.

WEBSITE

APPLY HERE

Note on JEE (Main) March, April & May-2021 Sessions

JEE Main 2021: Answer Keys Released for Feb Exam

Previous
Next Post »
0 Komentar

Google Tags