Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MoRTH further extends validity of vehicle-related documents till 30 June


MoRTH further extends validity of vehicle-related documents till 30 June

డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన సంభదిత ఇతర డాక్యుమెంట్ల గడువు పెంపు

డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువును పొడిగించింది. అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్‌పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నట్లు పేర్కొంది.

గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags