Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ECET 2021: Notification Released – Applications Started

 


TS ECET 2021: Notification Released – Applications Started

టీఎస్‌ ఈసెట్‌-2021 నోటిఫికేషన్ విడుదల – అప్లికేషన్లు మొదలు 

తెలంగాణ ఉన్నత విద్యా మండలి టీఎస్‌ ఈసెట్‌-2021 పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేసింది. బీఈ, బీటెక్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జులై 1వ తేదీన ఈ పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. 

రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది ఏడోసారి. మార్చి 17న పూర్తి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నేటి (మార్చి 22) నుండి మే 17 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అలాగే.. రూ.250 ఆలస్య రుసుంతో మే 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో జూన్‌ 14 వరకు, రూ.2,500 ఆలస్య రుసుంతో జూన్‌ 24వ వరకు అదే రూ. 5 వేల ఆలస్య రుసుంతో జూన్‌ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 400 కాగా ఇతర అభ్యర్థులకు రూ.800 గా నిర్ణయించారు. పూర్తి వివరాలను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

WEBSITE

IMPORTANT DATES

DETAILED NOTIFICATION

PAYMENT

APPLICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags