Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PGECET-2021 Schedule Released

 

TS PGECET-2021 Schedule Released

టి‌ఎస్ పీజీఈసెట్-2021 షెడ్యూల్ విడుదల  - జూన్ 19 నుంచి 22 వరకు ఆన్‌లైన్ పరీక్షలు

వచ్చే విద్యా సంవత్సరం( 2021-22)లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈ సెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పీజీఈ సెట్ కమిటీ తొలి సమావేశం గురువారం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, కన్వీనర్ పి. లక్ష్మీనారాయణ, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పీజీఈసెట్ కు  సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించి తేదీలు ఖరారు చేశారు. గతంలో జూన్ 20వ తేదీ నుంచి పరీక్షలు మొదలవుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించగా తాజాగా జూన్ 19 నుంచి 22 వరకు నాలుగు రోజులపాటు జరిగేలా నిర్ణయించారు.

మార్చి 6వ తేదీ: నోటిఫికేషన్ జారీ

మార్చి 12: ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఏప్రిల్ 30: ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు తుది గడువు

జూన్ 15 వరకు: ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం

జూన్ 10-18 మధ్య: హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు

జూన్ 19 నుంచి 22 వరకు: పరీక్ష తేదీలు 

Previous
Next Post »
0 Komentar

Google Tags