Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 04-04-2021

 

AP Covid-19 Media Bulletin 04-04-2021

ఏపీలో 1730 కొత్త కరోనా కేసులు

ఏపీలో భారీగా పెరుగుతున్న కొత్త కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తీవ్రత మరింత ఎక్కువైంది. ఒక్కరోజు వ్యవధిలో 31,072 నమూనాలను పరీక్షించగా 1,730 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,07,676కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,239కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 842 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 10,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,08,436 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.



Previous
Next Post »
0 Komentar

Google Tags