Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 27-04-2021

 

TS Covid-19 Media Bulletin 27-04-2021

తెలంగాణలో 10,122 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 కేసులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది.

మరోవైపు మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కొవిడ్‌తో చికిత్స పొందుతూ52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2094కి చేరింది. ఇక తాజాగా 6,446 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,40,590గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,221 క్రియాశీల కేసులు ఉన్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,440 కేసులు నమోదయ్యాయి.

COVID BULLETIN 27-04-2021

Previous
Next Post »
0 Komentar