Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రైవేటు‌ పాఠశాలల సిబ్బందికి తెలంగాణ సి‌ఎం శుభవార్త - ఆపత్కాల ఆర్థిక సాయం

 

ప్రైవేటు‌ పాఠశాలల సిబ్బందికి తెలంగాణ సి‌ఎం శుభవార్త - ఆపత్కాల ఆర్థిక సాయం

కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి శుభవార్త చెప్పారు.  రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. నెలకు రూ.2వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్‌ దుకాణాల ద్వారా 25కిలోల బియ్యం అందివ్వాలని సీఎం నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్‌ అకౌంట్‌, వివరాలతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 

దీనిపై విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుని విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రైవేటు‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

Previous
Next Post »
0 Komentar