TS: పైవేట్ ఉపాధ్యాయులకు
రూ.32 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో
పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ఏప్రిల్ నెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
చిత్రా రామచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇస్తే అవి 1.60 లక్షల మందికి సరిపోతాయి.
ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినపుడు 1.45 లక్షల మంది వరకు
లబ్ది పొందుతారని ప్రభుత్వం పేర్కొంది. తాజాగా 15 వేల మంది
పెరిగే అవకాశం ఉందని అంచనా వేసి ఈ మేరకు నిధులిచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా
సోమవారం రాత్రికి 1.25 లక్షల మంది ఆర్థిక సాయం కోరుతూ
దరఖాస్తు చేసుకున్నారు.
19లోగా ఉపాధ్యాయుల వివరాలివ్వండి
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి
25 కిలోల సన్న బియ్యాన్ని అందించేందుకు ఈ నెల 19వ తేదీలోపు వారి వివరాలను సమర్పించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్
కుమార్ పాఠశాల విద్యాశాఖను కోరారు. వాటి ఆధారంగా ఈ నెల 21 నుంచి
25వ తేదీ వరకు బియ్యాన్ని పంపిణీ చేస్తారు.
School Education Dept., – B.E 2021-22 - Budget Release Order for an amount of Rs.32,00,00,000/- (Rupees Thirty-Two Crores only) to the Director of School Education, Telangana, Hyderabad, towards financial Assistance to private Schools teaching and non-teaching – staff for the month of April, 2021 - Administrative Sanction - Orders –Issued.
0 Komentar