Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CoviSelf: జూన్‌ 1 నాటికి కోటి కిట్లు - ఇంట్లోనే కరోనా టెస్టు కోసం కొవిసెల్ఫ్‌ కిట్ వాడే విధానం ఇదే

 

CoviSelf:  జూన్‌ 1 నాటికి కోటి కిట్లు - ఇంట్లోనే కరోనా టెస్టు కోసం కొవిసెల్ఫ్‌ కిట్ వాడే విధానం ఇదే

ఇంట్లోనే కరోనా టెస్టు నిర్వహించుకొనేలా పుణెకు చెందిన మైల్యాబ్‌ సంస్థ కోవిసెల్ఫ్‌ కిట్లను తయారు చేసిన విషయం తెలిసిందే. ఐసీఎంఆర్‌ అనుమతించిన ఈ టెస్టు కిట్ల ధరను రూ. 250గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూన్‌ 1  నాటికి కోటి కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైల్యాబ్‌ సంస్థ డైరక్టర్‌ శ్రీకాంత్‌ పటోలే వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేం లొనావాలాలో రోజుకు 10 లక్షల యూనిట్ల కిట్లను తయారు చేస్తున్నాం. రానున్న పదిరోజుల్లోగా కోటి కిట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. జూన్‌ 1 నుంచి ఈ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. కిట్లను విడుదల చేసిన తర్వాత కొరత రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కిట్ల ఉత్పత్తిని మరింత పెంచుతాం’’ అని శ్రీకాంత్‌ తెలిపారు. 

ఈ కిట్ల ఆధారంగా పరీక్షించుకున్న వారు వేరే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లో సూచించింది. కరోనా లక్షణాలున్నవారు మాత్రమే ఈ కిట్‌ను వినియోగించాలని తెలిపింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, హోం క్వారంటైన్‌లో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

How To Use CoviSelf  for Home Testing RAPID Antigen Test Kit

Previous
Next Post »
0 Komentar

Google Tags