Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Cyber Agency Warns Android Users About Fake COVID-19 Vaccine Registration Message

 

Indian Cyber Agency Warns Android Users About Fake COVID-19 Vaccine Registration Message

కొవిడ్‌ వ్యాక్సిన్‌ నకిలీ యాప్‌లు సైబర్ టీమ్ హెచ్చరిక

 

‘‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొందడం కోసం ఈ యాప్‌ ద్వారా మీ పేరు నమోదు చేసుకోండి. ఇందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి’’ అంటూ స్మార్ట్‌ ఫోన్లకు నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయి. తద్వారా దుండగులు ఆయా ఫోన్లలోకి చొరబడి వాటిలో ఉన్న ఫోన్‌ నంబర్లను, డేటాను కాజేస్తున్నట్టు సైబర్‌ నిఘా అధికారులు గుర్తించారు. ఇలాంటి సంక్షిప్త సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ‘ది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌)’ ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా సూచనలు జారీ చేసింది.

‘‘కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. వీటిలోని లింకును ఓపెన్‌ చేశాక, యాప్‌ అనవసర అనుమతులన్నీ అడుగుతోంది. తద్వారా ఫోన్‌లోని కాంటాక్టు లిస్టు, ఇతర సమాచారాన్ని తస్కరించేందుకు వీలవుతోంది.

Covid19.apk, vaci__Regis.apk, MyVaccin__v2apk, Cov-Regis.apk, Vaccine-Apply.apk  వంటి పేర్లతో ఈ నకిలీ యాప్‌ ఫైళ్లు ఉంటున్నాయి. వ్యాక్సిన్‌ విషయంలో ఇలాంటి సందేశాలు, ఈమెయిళ్లు, యాప్‌లను నమ్మొద్దు.

కరోనా వ్యాక్సిన్‌ కోసం http://cowin.gov.in పేరున ఉన్న అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి. ఫోన్‌ సెట్టింగ్స్‌లోని ‘‘అన్‌ట్రస్టెడ్‌ సోర్సెస్‌’’ ఆప్షన్‌ను మార్చుకోవడం, నమ్మకమైన యాంటీ-వైరస్, ఇంటర్నెట్‌ ఫైర్‌వాల్‌ టూల్స్‌ను వాడటం ద్వారా నకిలీ యాప్‌ల బెడద నుంచి తప్పించుకోవచ్చు’’ అని సెర్ట్‌ సూచించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags