Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Lockdown in Kerala from May 8 to 16

 

Lockdown in Kerala from May 8 to 16

కేరళలో ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌

కేరళలో భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గట్లేదన్నారు. కొవిడ్‌ కట్టడికి లాక్‌డౌన్‌ తప్పట్లేదని స్పష్టం చేశారు. కేరళలో నిన్న ఒక్క రోజే 42 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగా గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలిస్థానంలో ఉంది. దేశంలో అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి నాలుగు స్థానాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags