Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలుగు ప్రజలు గర్వించదగ్గ నటుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి బయోగ్రఫీ

 

తెలుగు ప్రజలు గర్వించదగ్గ నటుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి బయోగ్రఫీ

పద్మశ్రీ నందమూరి తారక రామారావు (ఎన్‌టి‌ఆర్) నటునిగా, ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్విత స్థానాన్ని సంపాదించుకున్నాడు.

నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా, ఆంద్రప్రదేశ్ లో 28, మే 1923 న  జన్మించారు.

బాల్యంలోనే సంస్కృత శ్లోకాలు, పద్యాలూ, పెద్దబాలశిక్ష అవపాసన పట్టి, సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరు లోను విద్యాబ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాదమిక శిక్షణ పొందారు. ఆక్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన యన్.టి.ఆర్ 'మనదేశం' చలనచిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకుని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధపాత్రలలో జీవిస్తూ 320 చిత్రాలలోనటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని సంపాయించిపెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కధానాయకుడిగా నిలిచిపోయారు.

కుటుంబం

తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. 

చలనచిత్ర జీవితం

రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. 

రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు. 

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతనును మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత అతను మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.

1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 

1956లో విడుదలైన మాయాబజార్‌లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో అతను ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. 

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది.

NTR MOVIES LIST

==================

Watch Best Movies 👇

Old Malliswari

Jagadekaveeruni Katha

Pathala Bhairavi

ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల అతను నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు. 

రాజకీయ రంగప్రవేశం – ముఖ్యమంత్రి

1982 సం. లో తెలుగు ప్రజల కోరిక మేరకు,. రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

ముఖ్యమంత్రి గా ఉన్న తేదీల వివరాలు:

09/01/1983—16/08/1984

16/09/1984—03/12/1989

12/12/1994—01/09/1995 

73 సంవత్సరాల జీవన గమనంలో నటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామరావు 1996 జనవరి 18 న గుండెపోటుతో పరమపదించారు. 

Download… NTR Biography in Telugu

Previous
Next Post »
0 Komentar

Google Tags