Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 11-06-2021

 


AP Covid-19 Media Bulletin 11-06-2021

ఏపీలో కొత్తగా 8,239  కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో 1,01,863 మంది నమూనాలు పరీక్షించగా 8,239 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల  61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,824కి చేరింది.

24 గంటల వ్యవధిలో 11,135 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,88,198కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,02,39,490 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,396 కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి.

AP BULLETIN 11-06-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags