Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main 2021, NEET 2021 Entrance Exam Dates: Update from Education Ministry

 


JEE Main 2021, NEET 2021 Entrance Exam Dates: Update from Education Ministry

జేఈఈ, నీట్‌ షెడ్యూల్‌పై త్వరలో నిర్ణయం: కేంద్ర విద్యాశాఖ 

కరోనాతో ఉద్ధృతితో వాయిదా పడిన జేఈఈ (మెయిన్స్‌), నీట్‌(యూజీ) పరీక్షల షెడ్యూల్‌పై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘‘పెండింగ్‌లోని జేఈఈ (మెయిన్స్‌) పరీక్షలు, ఆగస్టు ఒకటో తేదీన జరగాల్సిన నీట్‌ పరీక్షపై త్వరలోనే సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి చెప్పారు.

విద్యార్థుల స్కోరింగ్‌ మెరుగుపరచుకునేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి జేఈఈ-మెయిన్స్‌ నాలుగు దశల్లో నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా తొలి రెండు దశలను ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించారు. కరోనా కారణంగా ఏప్రిల్‌, మేలో జరగాల్సిన మూడు, నాలుగు దశలు వాయిదా పడ్డాయి. నీట్‌ పరీక్షపై కూడా అనిశ్చితి నెలకొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags