Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు

 

ఏపీలో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపులు ఉంటాయని తెలిపింది. సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు మూసేయాలని ఆదేశించింది.

వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉండనున్నాయి. గోదావరి జిల్లాలు మినహా మిగతా చోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసేయనున్నారు. ఉభయ గోదావరిలో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags