Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: కొత్త ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు అనుమతి - ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ

 

AP: కొత్త ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు అనుమతి - ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ

రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల ఏర్పాటు, గుర్తింపు, పాలనా వ్యవహారాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలతో మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షణలో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించింది. ఉన్నత విద్య ప్రమాణాల పెంపుదలలో భాగంగా యూజీసీ 90 శాతం ఇంటర్ విద్యార్థులు, 70 శాతం మేర పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులతో పాటు 80 శాతం ఫ్యాకల్టీలతో విశ్వవిద్యాలయాలకు అనుబం ధంగా కళాశాలలు ఏర్పాటవుతాయి.  రాష్ట్ర ప్రభుత్వ కాంపిటెంట్ అథారిటీ కళాశాల స్థాపన ప్రాంతంలో ఉన్నత విద్యావసరాలను గుర్తించి ఆమేరకు అనుమ తులిస్తుంది. ఇందుకోసం ప్రతి మూడేళ్లకోసారి సర్వే నిర్వహిస్తారు. ఆర్ట,సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్ మెంట్ కోర్సుల నిర్వహణకు అవకాశం ఉంటుంది. ఏపీ సొసైటీస్ యాక్ట్ కింద సంస్థ రిజిస్టర్ అయి ఉండాలి.

మెగా సిటీలో 2 ఎకరాలు, మెట్రోపాలిటన్ నగరాల్లో 5 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 1.5 ఎకరం భూసేకరణకు మాత్రమే అనుమతి ఉంటుంది. తరగతి గదుల్లో ఒక్కో విద్యార్థికి 15 చదరపు అడుగులు, ల్యాబ్లలో 20 చదరపు అడుగులు ఉండేలా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్మాణాలు జరపాలి. అర్హ అండ్ సైన్స్,కామర్స్ కోర్సుల నిర్వహణకు రూ. 15 లక్షల చొప్పున కార్పస్ ఫండ్ డిపాజిట్ చెల్లించాలి. దీనిపై 50 శాతం వడ్డీ వర్తిస్తుంది. నాక్, ఏ- గ్రేడ్ విద్యాసంస్థలకు హానర్స్ అవకాశం ఉంటుంది. అన్నిరకాల సదుపాయాలతో పాటు భద్రతా ప్రమాణాలతో కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Higher Education Department — The Andhra Pradesh Private Higher Educational Institutions (Establishment, Recognition, Administration and Control of Institutions) Rules, 2021 for granting permission to start Private Un-aided Degree Colleges, un-aided Under Graduate and Post Graduate Courses and related matters thereon - Orders - Issued.

G.O.MS.No. 36 Dated: 15-07-2021.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags