Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Disney+ Hotstar Introduces New Plans Starting at Rs 499

 

Disney+ Hotstar Introduces New Plans Starting at Rs 499

హాట్‌స్టార్‌లో ‘మొబైల్’ ప్లాన్‌ తో పాటు మరో రెండు కొత్త ప్లాన్లు – వివరాలు ఇవే

మిగతా ఓ‌టి‌టిలకు పోటీగా డిస్నీ+ హాట్‌స్టార్ మూడు కొత్త ప్లాన్లను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్ ₹499, సూపర్ ₹899, ప్రీమియం ₹1,499లతో ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌ను యూజర్స్‌ ఆస్వాదించవచ్చు. సెప్టెంబరు 1 నుంచి ఈ కొత్త ప్లాన్లు అమల్లోకి రానున్నాయి. అలానే ఈ ప్లాన్స్‌ ద్వారా సబ్‌స్క్రైబర్స్‌ అందరు డిస్నీ+ ఒరిజినల్స్, హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, డిస్నీ, మార్వెల్‌, స్టార్‌వార్స్‌, నేషనల్ జియోగ్రఫీ, హెచ్‌బీవో, ఎఫ్‌ఎక్స్‌, షోటైమ్‌, 20 సెంచరీ, సెర్చ్‌లైట్ పిక్చర్స్‌ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. గతంలో ఇవి కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇకమీదట డిస్నీ+ హాట్‌స్టార్‌లో వీఐపీ ప్లాన్‌ ఉండబోదని ప్రకటించింది. 

డిస్నీ+ హాట్‌స్టార్‌లోని కంటెంట్ మరింత మంది యూజర్స్‌కు చేరువచేయాలనే లక్ష్యంతో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొస్తున్నట్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ చీఫ్ సునీల్ రాయన్ తెలిపారు. ₹ 499 మొబైల్ ప్లాన్‌లో హెచ్‌డీ క్వాలిటీతో ఒక్క యూజర్‌ మొబైల్‌లో మాత్రమే వీడియోలను ఆస్వాదించవచ్చు. అలానే ₹899 సూపర్ ప్లాన్‌లో రెండు డివైజ్‌లలో యూజర్స్ హెచ్‌డీ క్వాలిటీలో డిస్నీ+ హాట్‌స్టార్‌ వీడియోలను చూడొచ్చు. ఇక ₹1,499 సబ్‌స్క్రిప్షన్‌తో నాలుగు డివైజ్‌లలో 4కే క్వాలిటీ వీడియోలను ఎంజాయ్ చెయ్యొచ్చు. ప్రస్తుతం ప్రీమియం ప్లాన్ సబ్‌స్క్రైబర్స్‌కి కేవలం రెండు డివైజ్‌లకు మాత్రమే అనుమతి ఉంది. తాజా ప్లాన్‌లో వాళ్లు నాలుగు డివైజ్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags