Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: దోస్త్‌-2021 రిజిస్ట్రేషన్ల గడువు పెంపు - ఎడ్‌సెట్‌-2021 దరఖాస్తుల గడువు పెంపు

 

TS: దోస్త్‌-2021 రిజిస్ట్రేషన్ల గడువు పెంపు - ఎడ్‌సెట్‌-2021 దరఖాస్తుల గడువు పెంపు

 

DOST-2021: దోస్త్‌-2021 రిజిస్ట్రేషన్ల గడువు పెంపు

దోస్త్‌ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లకు గడువు ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్టు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. ఇవాళ్టి వరకు 1.40లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు చెప్పారు.  ఈనెల 31న డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 9వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 2 నుంచి 9 వరకు రెండో విడత వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని పేర్కొ్నారు.

ఆగస్టు 14న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మీ సేవా కేంద్రాల్లోనూ దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. దోస్త్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.

WEBSITE

 

EdCET-2021: ఎడ్‌సెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

ఎడ్‌సెట్‌ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించినట్టు కన్వీనర్‌ తెలిపారు. ఈనెల 22 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వ్యాయామ కోర్సుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కన్వీనర్‌ సత్యనారాయణ తెలిపారు. నేటి వరకు పీఈసెట్‌కు 3,462 దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. బీపెడ్‌కు 1988, డీపెడ్‌కు 1544 దరఖాస్తులు వచ్చాయన్నారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags