Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSLPRB Recruitment-2021: Apply 151 Assistant Public Prosecutor Posts

 

TSLPRB Recruitment-2021: Apply 151 Assistant Public Prosecutor Posts

టి‌ఎస్‌ఎల్‌పి‌ఆర్‌బి  - 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదారబాద్ (లక్డీకపూల్)లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ (TSLPRB) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ)

మొత్తం ఖాళీలు: 151 (మల్టీ జోన్-1: 88, మల్టీ జోన్-2: 83)

అర్హత: ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా (ఎల్‌ఎల్‌బీ/ బీఎల్)/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 04 జులై 2021 నాటికి అభ్యర్థులు రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 34 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ. 54220 - 133630 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1, 100 మార్కులకి, పేపర్ 2, 100 మార్కులకి ఉంటాయి. పేపర్ 1 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో, పేపర 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ప్రతి పేపర్ కి 3 గంటల సమయం ఉంటుంది. రెండు పేపర్లకి సంబంధించిన ఈ పరీక్షని ఇంగ్లిష్ మాధ్యమంలో నిర్వహిస్తారు. పేపర్ 1లో అర్హులైన అభ్యర్థులకి మాత్రమే పేపర్ 2 ఎవాల్యూయేషన్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags