Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Academic Calendar 2021-22: విద్యా క్యాలెండర్లో పేర్కొన్న సమయాల గురించి వివరణ - ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి

 

Academic Calendar 2021-22: విద్యా క్యాలెండర్లో పేర్కొన్న సమయాల గురించి వివరణ - ఆ సమయాలు ఐచ్ఛికమే - ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి

రాష్ట్రంలో పాఠశాలలు 2021-22లో నిర్వహించాల్సిన అంశాలతో విడుదల చేసిన విద్యా క్యాలెండర్లో పేర్కొన్న సమయాలు టీచర్లందరికీ వర్తించేవి కావని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు సెల్ఫ్ స్టడీ తదితర సహ పాఠ్యకార్యక్రమాలు విద్యార్థులు, టీచర్ల ఐచ్ఛికం ప్రకారమే నిర్వహించుకోవచ్చని తెలిపారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్దేశించిన విద్యార్థుల సెల్ఫ్ స్టడీ, సవరణాత్మక బోధన వంటివి కూడా ఉపాధ్యాయులు, టీచర్ల ఐచ్ఛికానుసారమే నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.

ఇతర టీచర్లకు స్కూళ్ల రెగ్యులర్ సమయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే ఉంటుందని, ఈ అంశాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు.

AP: 1 to 10th Class Year Plans 2021-22 – Academic Calendar, Time Table, Holidays List and Month-Wise Activities 👇

CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags