Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (17-08-2021)

 


ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలుసమాధానాలు (17-08-2021)

 

1. ప్రశ్న:

పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu, Hindi, Urdu ఎవరు రాయాలి?

జవాబు:

ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu (P.code-37) రాయాల్సి ఉంటుంది.

10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi / Urdu రాయాల్సి ఉంటుంది.    

--------------------------------------------

2. ప్రశ్న:

సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్  సరెండర్ చేసుకోవచ్చునా?

జవాబు:

G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్ననురోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.

G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది. అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.                    

-----------------------------------------------

3. ప్రశ్న:

నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను. రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే, DEO గారి అనుమతి తీసుకోవాలా?

జవాబు:

అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.

---------------------------------------------

4. ప్రశ్న:

చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

జవాబు:

G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి. మంజూరు ఉత్తర్వులిచ్చి, ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.

--------------------------------------------

5. ప్రశ్న:

స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?

జవాబు:

డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది:27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags