Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IDBI Recruitment 2021: Apply for 650 Assistant Manager Grade ‘A’ Posts through PGDBF

 

IDBI Recruitment 2021: Apply for 650 Assistant Manager Grade ‘A’ Posts through PGDBF

IDBI: ఐడీబీఐలో 650 అసిస్టెంట్ మేనేజర్ల ఖాళీలు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ), మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (9 నెలలు క్లాస్ రూం + 3 నెలలు ఇంటర్నషిప్) పాటు పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీబీఎఫ్)లో ట్రెయినింగ్ ఇచ్చి ఈ కోర్సు విజయవంతగా పూర్తి చేసుకున్నవారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇస్తారు.

మొత్తం ఖాళీలు: 650

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పత్రి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.08.2021.

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 22.08.2021.

పరీక్ష తేది: 04.09.2021.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

NOTIFICATION

APPLY HERE  (OPEN IN LANDSCAPE MODE IN MOBILE)

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags