Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Benefits of Milk and Apple – Best time to Eat Apple and Drink Milk for Better Results

 

Benefits of Milk and Apple – Best time to Eat Apple and Drink Milk for Better Results

పాలు మరియు ఆపిల్ యొక్క ప్రయోజనాలు – పాలు, పండ్లని కొన్ని సమయాల్లో తీసుకుంటే మంచి ఫలితాలు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే


APPLE:

ఆపిల్స్ను తరుచూ తీసుకోమని పలువురు న్యూట్రీషనిస్టులు చెబుతారు. చాలా మంది కూడా ఆపిల్‌ను రోజూ తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. ఆపిల్​‌ను తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అందరూ నమ్ముతారు.

ఆరోగ్యం కోసం అందరూ ఆపిల్ ను  ఎంచుకుంటారు. ఆపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉంటారని అనేక పరిశోధనల్లో కూడా రుజువైంది. అందుకే అందరూ ఆపిల్ తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. ఆపిల్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఒక ప్రముఖ ఇంగ్లిష్ సామెత కూడా ప్రాచూర్యంలో ఉంది. అంతలా ఆపిల్ ను తింటే ఆరోగ్యంగా ఉంటారని జనాల మదిలో నిండిపోయింది.


MILK:

ఆపిల్ ను తీసుకోవడంతో పాటు పాలను తాగడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతారు. పాలను కొంత మంది ఉదయం లేవగానే తాగుతారు. మరికొంత మంది రాత్రి పడుకునే సమయంలో కొంత మంది రోజులోని వివిధ సమయాల్లో పాలను తాగుతూ ఉంటారు. ఎటువంటి సమయంలో పాలను తాగితే బెటర్ అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. కానీ ఇది చాలా మంది పెద్దగా పట్టించుకోరు. వారికి అనువుగా ఉన్న సమయంలో పాలను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. పాలతో పాటు కొంత మంది టీ, కాఫీలను కూడా తరుచూ తీసుకుంటూ ఉంటారు. వీటికి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని చాలా మంది నిపుణులతో పాటు అనేక మంది చెబుతారు.

COFFE & TEA

అసలు కాఫీ వలన ఏదైనా శారీరక సమస్యలు ఉన్న వారు మరింత ఎక్కువ సమస్యలకు లోనవుతారని చెబుతారు. అంతే కాకుండా గర్భవతులు, బాలింతలు కాఫీని తాగడం మంచిది కాదని చెబుతారు. కాఫీలో ఉండే కెఫిటిన్ అనే పదార్థం వలన గర్భవతులు, బాలింతలు ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తారు. కేవలం వీరు మాత్రమే కాకుండా ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా అధిక మొత్తంలో కాఫీని తీసుకోవడం మంచిది కాదని చెబుతారు. ఇక టీ విషయానికి వస్తే కూడా అధిక మొత్తంలో టీని తీసుకోవడం మంచిది కాదని చెబుతారు. టీ వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తారు. 


APPLE – MILK  Vs COFEE & TEA

టీ, కాఫీ, ఆపిల్స్, పాలను ఏ సమయంలో తీసుకోవాలని చాలా మందిలో సందేహాలు ఉంటాయి. పాలతో మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలిగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. టీ, కాఫీ, పాలు, ఆపిల్స్ ఏ సమయంలో తీసుకోవడం మంచిదనే విషయం గురించి నిపుణులు ఏమని చెబుతున్నారంటే?? 

మెరుగైన ఫలితాల కోసం ఆపిల్ తినడానికి మరియు పాలు తాగడానికి ఉత్తమ సమయం వివరాలు ఇవే 

మనలో చాలా మంది ఉదయం లేవగానే వెచ్చ, వెచ్చని కాఫీని కానీ టీ ని కానీ తాగుతారు. మరి కొంత మందిలో అసలు టీ లేదా కాఫీ తాగనిది రోజు మొదలుకాదు. అంతలా కాఫీ, టీ లకు అడిక్ట్ అవుతారు. అంతలా కూడా కాఫీ, టీ లను అతిగా వాడడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. లేవగానే కాఫీ, కానీ టీ తాగడం శరీరానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ న్యూట్రీషియనిస్ట్ చెప్పిన దాని ప్రకారం కాఫీ, టీ, పాలను ఏ సమయంలో తీసుకోవాలనే విషయం గురించి వివరించారు.

పొద్దున లేవగానే కాఫీ, టీ లకు బదులు పాలను తాగాలని సూచిస్తున్నారు. కాఫీ, టీ లలో మన శరీరానికి హాని చేసే కారకాలు ఉంటాయి కానీ పాలు మన శరీరానికి అనేక ప్రయోజనాలను ఉన్నాయి. 

ఉదయం వేడి, వేడి టీ, లేదా కాఫీని తీసుకోవడం వలన మనసు చాలా ఉత్తేజంగా ఉండి రిలాక్సింగ్ ఉంటామని అనేక పరిశోధనల్లో తేలినట్లు న్యూట్రీషనిస్టులు పేర్కొన్నారు. కాఫీలో అధికంగా ఉన్న కెఫీన్ అనే పదార్థం వలన మనసు ఉత్తేజంగా ఉంటుందని సూచించారు. కానీ పొద్దున లేవగానే టీ, కాఫీ ని తీసుకోవడం మంచిది కాదని... ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. 

పొద్దున లేవగానే పాలు తీసుకోవడం చాలా మంచిదట. ఇలా పొద్దునే పాలు తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని న్యూట్రీషియనిస్టులు సూచించారు. పాలల్లో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయని వివరించారు.

పాలను నిద్ర పోయే ముందు తీసుకోవడం వలన నిద్ర బాగా వస్తుంది. పాలల్లో ఉండే ట్రైప్రోటాన్, మరియు అమినో ఆమ్లాల వలన మనకు నిద్ర చక్కగా వస్తుంది.

కావున పాలను పడుకునే ముందు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచించారు. పాలను రాత్రి పూట తాగడం వలన ప్రశాంతంగా నిద్ర రావడం మాత్రమే కాకుండా మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. 

పాలు తీసుకున్న విధంగానే ఆపిల్స్ ను ఉదయం పూట తీసుకోవడం చాలా మంచిదని న్యూట్రీషియనిస్టులు సూచించారు. ఇలా పరిగడుపు ఆపిల్స్ తీసుకోవడం వలన మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అంతే కాకుండా జీర్ణక్రియ కూడా సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి. కేవలం ఆపిల్స్ మాత్రమే కాకుండా చెర్రీ పండ్లు కూడా మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు తోడ్పాటునందిస్తాయని న్యూట్రీషియనిస్టులు తెలిపారు. వీటిని రాత్రి పూట తీసుకోవడం వలన మనలో నిద్ర బాగా వస్తుందట. కాబట్టి టీ, కాఫీ లను తీసుకోవడం తగ్గిస్తేనే మన ఆరోగ్యానికి ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కాఫీ, టీలకు బదులు పాలు, ఆపిల్స్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని న్యూట్రీషియనిస్టులు సూచించారు. ఒక వేళ ఆపిల్ పండ్లను కాకుండా కాఫీ, టీ లను తీసుకోవాల్సి వస్తే.. సమయ పాలన పాటిస్తూ మెదులుకోవడం అలవర్చుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags