Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (18-09-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు సమాధానాలు (18-09-2021)

=======================

1. ప్రశ్న:

నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా?

జవాబు:

ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.

=======================

2. ప్రశ్న:

ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా?

=======================

జవాబు:

చేర్చకూడదు. అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

======================

3. ప్రశ్న:

నా భార్య హౌస్ వైఫ్. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా?

======================

జవాబు:

జీఓ. 802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.

======================

4. ప్రశ్న:

మెడికల్ సెలవులో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా?

జవాబు:

చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది. మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు. అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.

======================

5. ప్రశ్న:

స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జవాబు:

స్వచ్ఛంద ఉద్యోగ విరమణకి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR, 10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు, సెల్ఫ్ డిక్లరేషన్ జతపరచాలి

Previous
Next Post »
0 Komentar

Google Tags