Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు - సమాధానాలు

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:

TTC అర్హతతో SGT గా 05-07-1997join అయిన ఉపాధ్యాయుడు 24 years scale కోసం తప్పనిసరిగా డిపార్ట్మెంటల్ tests రాయాలా? అతని అర్హత ఇప్పటికీ TTC నే. 24 years ఇవ్వవచ్చా?

జవాబు:

Degree, B.Ed ఉండి Departmemtal టెస్ట్ పాసైతేనే 24 years scale ఇస్తారు. అవి లేకుండా TTC తో 24 YEARS ఇవ్వరు.

•••••••••

2. ప్రశ్న:

హార్ట్ ఎటాక్ వల్ల ఒక ఉపాధ్యాయుడు తేదీ 09-07-2021 ఉదయం 08-30  కి మరణించారు. ఆ ఉపాధ్యాయుడి కి శాలరీ ఏ తేదీ వరకు ఇవ్వాలి. కొందరు 09-07-201 వరకు ఇవ్వాలి అని అంటున్నారు. ఇది కరెక్టా ? తెలుపగలరు?

జవాబు:

కరెక్టే. వారికి 9-07-2021 వరకు శాలరీ బిల్ చేయాలి.

•••••••••

3. ప్రశ్న:

అలాగే సదరు ఎంప్లాయ్ (expired) కి deductions upto 9-07-2021 వరకు ఏమేమి చేయాల్సి ఉంటుంది?

జవాబు:

ఉదయం 8.30 కే మరణించడం జరిగింది కనుక, అతను 09.07.2021 వరకు విధుల్లో ఉన్నట్లు లెక్క. కనుక బిల్స్ 09.07.2021 వరకే చెయ్యాలి. APGLI, GIS నెలలో ఎంత ఉంటే అంత కట్ చెయ్యాలి. PT కట్ చేయనవసరం లేదు.

•••••••••

4. ప్రశ్న:

Apgli c బాండ్ మరియు మిస్సింగ్ క్రెడిట్స్ అప్లయ్ చేశాను. c bond వచ్చింది కాని మిస్సింగ్ క్రెడిట్స్ అప్డేట్ కాలేదు. ఏమి చేయాలి?

జవాబు:

మీ యొక్క శాలరీ బిల్ Token number, మీకు కట్ అయ్యే షెడ్యూల్డ్ ఎమౌంట్ ను సూచిస్తూ ఒక లెటర్ ను apgli ఆఫీస్ వారికి వ్రాసి దానిని డి.డి.వో తో అటెస్ట్ చేయించి ఇవ్వండి. తప్పక సరిచేస్తారు.

•••••••••

5. ప్రశ్న:

G.O no 52 ప్రకారంగా hysterectomy (గర్భసంచి తొలగింపు) operation చేయించుకుని సెలవులో ఉన్న ఉపాధ్యాయురాలు కు శాలరీ క్రెడిట్ చేయవచ్చా? లేదా?

జవాబు:

వైద్య పరమైన సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించవచ్చు. అయితే ఆ సెలవు పీరియడ్ లో ఎటువంటి ఇంక్రిమెంట్లు ఇవ్వరాదు.

•••••••••

6. ప్రశ్న:

నేను ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ ఫర్ లో 1998 సెప్టెంబర్ 14 న వచ్చాను. ఈ జిల్లాలో 26-10-1998 న డియస్స్సి. 98 వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం ప్రకారం నా పేరు ముందుగా రావాలి కదా, కానీ నా పేరు 1998 లిస్ట్ చివరన ఉంది, ఇది కరెక్టేనా? నా అపాయింట్ మెంట్ 1995. వారి కంటే నేను ముందు ఉద్యోగంలో చేరాను.

జవాబు:

Inter District transfers లో వస్తే ఆ DSC లో మీరు జూనియర్ అవుతారు. కాబట్టి మీ పేరు lost లో నే ఉంటుంది.

•••••••••

7. ప్రశ్న:

నేను SSC ఎగ్జామినేషన్ ఇంఛార్జిగా 2018-19, 2019-20, 2020-21లలో పనిచేశాను.అయితే నాకు ఎన్ని EL's వస్తాయి? మూడు విద్యా సంవత్సరాలకు EL's వస్తాయా?

జవాబు:

14 రోజుల EL's కు ఎల్జిబిలిటీ వస్తుంది. అది కూడా 2018-19 సంవత్సరానికి మాత్రమే. 2019-20 & 2020-21 సంవత్సరాలలో పరీక్షల నిర్వహణ లేనందున ఆకాలంలో EL's రావు.

Previous
Next Post »
0 Komentar

Google Tags