Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt to Resume Biometric Attendance for Employees of All Level from November 8

 

Govt to Resume Biometric Attendance for Employees of All Level from November 8

కేంద్ర ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు పునరుద్ధరణ 

కరోనా ఉద్ధృతి సమయంలో తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. బయోమెట్రిక్‌ హాజరు విధానం నుంచి మినహాయింపు ఇందులో ఒకటి. అయితే.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న నేపథ్యంలో దీన్ని మళ్లీ పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది.

నవంబర్ 8 నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లను తప్పనిసరిగా ఉంచాలని, దీంతోపాటు ఉద్యోగులు హాజరుకు ముందు, తర్వాత తమ చేతులను విధిగా శుభ్రపరచుకునేలా చూసుకునే బాధ్యత విభాగాధిపతులదేనని స్పష్టం చేసింది. 

అవసరమైతే అదనపు యంత్రాలు.. 

ఉద్యోగులందరూ హాజరు వేసేటప్పుడు తప్పనిసరిగా ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. విధిగా మాస్కు ధరించాలి. రద్దీని నివారించేందుకు అవసరమైతే అదనపు బయోమెట్రిక్ హాజరు యంత్రాలను ఏర్పాటు చేయొచ్చు’ అని సంబంధిత శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు జారీ చేసిన తాజా ఆదేశాల్లో పేర్కొంది.

మరోవైపు సమావేశాలను సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలోనే కొనసాగించాలని సూచించింది. ప్రజాప్రయోజనం ఉంటే తప్ప.. సందర్శకులతో వ్యక్తిగత సమావేశాలను నివారించాలని చెప్పింది. కార్యాలయాల్లో ఉన్నప్పుడు సిబ్బంది విధిగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు కొన్ని ఎంఎన్‌సీలు, ప్రైవేటు సంస్థలు సైతం ‘వర్క్‌ ఫ్రం హోం’లో ఉన్న తమ ఉద్యోగులకు క్రమంగా కార్యాలయాలకు రప్పిస్తున్న విషయం తెలిసిందే.

OFFICIAL MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags