Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

◼◼◼◼◼◼◼◼◼◼ 

1.  ప్రశ్న:

అనారోగ్యం కారణంగా 3 రోజులు ఆకస్మికేతర సెలవు వినియోగించు కున్నాను. మా GHM 3రోజులు వేతనాన్ని challan కట్టారు. సకల జనుల సమ్మె కు జమ చేయబడిన 16 రోజుల నుండి 3 రోజులు మంజూరు చేసి బిల్ క్లెయిమ్ చేయండి. అంటే అంగీకరించడం లేదు. సమంజసమేనా?

జవాబు:

కరెక్ట్ కాదు.. మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017 ప్రకారం SJS లీవ్స్ అవసరం మైన సందర్భంలో ఆకస్మికేతర సెలువుగా వాడుకోవడానికి ఇవ్వబడినవి.

వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..

కావున 3రోజుల OCL కాలానికి SJS EL's 3డేస్ మంజూరు చేసి వేతనం చెల్లించాలి

◼◼◼◼◼◼◼◼◼◼

2.  ప్రశ్న:

సర్, TA, FTA అంటే ఏమిటి? ఎలా వాటిని తీసుకొనే విధానం తెలుపగలరు.

జవాబు:

TA అనేది మీ ప్రధాన కార్య స్థానం నుండి 8 కిమీ పై బడిన అధికారిక ప్రయాణాలకు మీరు క్లెయిమ్ చేసుకోవాలి.

FTA అనేది విధి నిర్వహణ లో భాగంగా నిత్యం క్యాంప్స్ కి వెళ్ళేవారికి ప్రభుత్వం కొన్ని శాఖలలోని కొన్ని పోస్టులకి మంజూరు చేస్తుంది. ఈ రొటీన్ క్యాంప్స్ కి FTA మంజూరు చేస్తే TA క్లెయిమ్ చేయడానికి ఉండదు.

◼◼◼◼◼◼◼◼◼◼

3.  ప్రశ్న:

అపాయింట్మెంట్ లేదా రిటైర్మెంట్ పెన్షన్ తీసుకునే సందర్భంగా పుట్టినతేది మరియు నెల లేకుండా కేవలం సంవత్సరం మాత్రం తెల్సిన వార్కి ఏ నెలను ప్రాతిపదికగా తీసుకోవాలో తెలియజేయగలరు.

(70 సంవత్సరాల వయసు దాటాక పెన్షన్ ఎన్ హేన్స్ మెంట్ అవుతుంది కదా మా అమ్మ గార్కి 70 సం దాటాయి. కానీ ఆధార్ కార్డు లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉన్నది.)

జవాబు:

ఆధార్ కార్డ్ ను బట్టి కాదు. పెన్షన్ పేపర్స్ లో ఏమివేశారో అది చూడాలి. 2) పుట్టిన తేదీ కాదు, పెన్షన్ commutation date nundi 15 yrs కు పెరుగుతుంది.

◼◼◼◼◼◼◼◼◼◼

4.  ప్రశ్న:

మా అన్నయ్య గారు ది.02/05/2021 న కరోనా వలన మరణించారు. అయితే మా అన్నయ్యకు ఒక్కతే కుమార్తె మాత్రమే ఉన్నది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుచున్నది. ఆమె ది.25/10/2005  బర్త్ డే. కాంపెన్సేషన్ అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు?

జవాబు:

మీకు compassionate appointment రావాలి అంటే కనీసం తన father చనిపోయిన తేదీకి, తన పిల్లలకి 16 yrs నిండి ఉండాలి. చనిపోయిన తేదీ నుండి 2 yrs లోపు తనకు 18 yrs నిండాలి.

అమ్మాయికి 18 సంవత్సరాలు లేనందున Ex-gratia కు మాత్రమే అర్హులు.

అతని భార్య అప్లై చేసుకుంటే అర్హతకు తగిన పోస్టు నందు నియామకం చేస్తారు.

ఒకవేళ అలా లేకపోతే govt కి representation చేస్తే special go తెచ్చుకోవచ్చు. Relaxation GO కి representation చేయచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags