Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New Netflix Top 10 Website Launched for Most Popular Titles

 

New Netflix Top 10 Website Launched for Most Popular Titles

నెట్‌ఫ్లిక్స్‌ నుంచి టాప్‌10 జాబితా కొరకు కొత్త వెబ్‌సైట్‌

సినిమాలు, వెబ్‌సీరిస్‌లు ఓటీటీల్లో అందుబాటులో ఉంటాయి. కానీ, వాటిల్లో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన, హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో తెలుసుకోవడం కాస్త కష్టం. దీంతో ‘ఏ సినిమా బాగుంది.. ఏ వెబ్‌సిరీస్‌ చూడొచ్చు?’ అంటూ సినిమాలపై అవగాహన ఉన్నవారిని, స్నేహితుల్ని అడుగుతుంటాం. నెట్‌ఫ్లిక్స్‌ విషయంలో ఆ ఇబ్బంది లేకుండా ఆ సంస్థే.. ‘టాప్‌10.నెట్‌ఫ్లిక్స్‌ (https://top10.netflix.com/)’ అనే వెబ్‌సైట్‌ను తాజాగా ప్రారంభించింది.

ఇంగ్లీష్‌, నాన్‌ ఇంగ్లీష్‌ కేటగిరీల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎక్కువ మంది చూసిన టాప్‌ 10 సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితాలను ఇందులో పొందుపరుస్తోంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రేక్షకులు వీక్షించిన సమయం ఆధారంగా రూపొందించే టాప్‌ 10 జాబితాలను ప్రతి మంగళవారం వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఒక సినిమా లేదా వెబ్‌సిరీస్‌కి వేర్వేరు దేశాల్లో ఎంత మేర ఆదరణ ఉందనేది కూడా ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ ఇంగ్లీష్‌, స్పానిష్‌ భాషల్లో ఉండగా.. వచ్చే ఏడాది నుంచి మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Top 10 By Country

Global Top 10

Previous
Next Post »
0 Komentar

Google Tags