Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Disney+ Hotstar giving monthly subscription at Rs 49 to select users, check details

 

Disney+ Hotstar giving monthly subscription at Rs 49 to select users, check details

డిస్నీ+ హాట్‌స్టార్‌ రూ.49కే డిస్నీ+ హాట్‌స్టార్‌ కొత్త ప్లాన్‌ - వివరాలు ఇవే

డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కొత్తగా నెలవారీ మొబైల్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 49 సబ్‌స్క్రిప్షన్‌తో ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీనిద్వారా యూజర్స్‌ ఏదైనా ఒక డివైజ్‌ (స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌)లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలను పొందగలరు. 720 పిక్సెల్ హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. ఇందులో యాడ్స్‌ కూడా ఉంటాయి. దీని గురించి డిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ పలువురు యూజర్స్ రెడిట్ సామాజిక మాధ్యమం ద్వారా రూ.49 ప్లాన్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అయితే రూ.99 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌నే కార్డ్‌, ఫోన్‌పే, పేటీఎం, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు రూ.49కే అందజేస్తున్నట్లు మరికొంతమంది యూజర్స్ పేర్కొన్నారు. 

ఇవేకాకుండా డిస్నీ+ హాట్‌స్టార్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై రూ. 100 తగ్గింపును ఇస్తోంది. అంటే రూ. 299 ప్లాన్‌ను యూజర్స్ 6 నెలలకు సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే రూ. 199కే లభిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబరులో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ధరలలో మార్పులు చేసింది. రూ. 399 వీఐపీ ప్లాన్‌తో యూజర్స్ అన్ని రకాల కంటెంట్‌ను చూడొచ్చు. అలానే కొత్తగా రూ. 499 మొబైల్‌, రూ. 899 సూపర్‌, రూ. 1,499 ప్రీమియం పేరుతో మూడు వార్షిక ప్లాన్లను పరిచయం చేసింది. వీటిలో ప్రీమియం సబ్‌స్క్రైబర్స్ ఒకేసారి నాలుగు డివైజ్‌లలలో 4K క్వాలిటీ వీడియోలను వీక్షించవచ్చు. సూపర్ ప్లాన్‌లో యూజర్స్ ఒకేసారి రెండు డివైజ్‌లలో హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను చూడొచ్చు. మొబైల్ ప్లాన్‌ సబ్‌స్క్రైబర్స్ కేవలం ఒక మొబైల్‌లో మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌ను పొందొచ్చు. 

ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌ కూడా సబ్‌స్క్రిప్షన్ ధరలను 60 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ మొబైల్‌ ప్లాన్‌ ఇక మీదట రూ. 149కే లభించనుంది. అలానే బేసిక్ ప్లాన్‌ ధరను రూ. 199కి, స్టాండర్డ్‌ ప్లాన్‌ రూ. 499, ప్రీమియం ప్లాన్‌ రూ. 649కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అలానే ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వార్షిక చందాను రూ.999 నుంచి రూ.1499కి పెంచనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. త్రైమాసిక చందా ప్రస్తుతం రూ.329 ఉండగా.. దాన్ని రూ.459కి పెంచనున్నట్లు పేర్కొంది. నెలవారీ ప్లాన్‌కు ప్రస్తుతం రూ.129 చెల్లిస్తుండగా ఇకపై రూ.179 చెల్లించాల్సి ఉంటుందని అమెజాన్‌ తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags