Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google Assistant’s Family Bell feature is now available on mobile – More Feature Available Soon

 

Google Assistant’s Family Bell feature is now available on mobile – More Feature Available Soon

కొత్త ఆండ్రాయిడ్ ఫీచర్స్‌ - ఫ్యామిలీ బెల్ ఫీచర్ తో పాటు మరి కొన్ని నూతన ఫీచర్ల వివరాలు ఇవే

గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కు శుభవార్త చెప్పింది. త్వరలో మరిన్ని కొత్త ఆండ్రాయిడ్ ఫీచర్స్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్స్‌ రోజువారీ జీవితంలో యూజర్స్‌కు ఎంతో ఉపయోగకరమైనవని గూగుల్ తెలిపింది. వీటిలో ఫ్యామిలీ బెల్, విడ్జెట్స్‌, గూగుల్ ఫొటోస్ మెమొరీస్‌, డిజిటల్‌ కారు కీ, ప్రైవసీ బూస్టర్‌, కొత్త ఎమోజీ కాంబినేషన్స్‌ వంటివి ఉన్నాయి. మరి ఈ ఫీచర్స్ ఎలా పనిచేస్తాయి.. వీటితో ఎలాంటి సేవలు పొందొచ్చనేది తెలుసుకుందాం.

GOOGLE ASSISTANT APP


1. Family Bell - కుటుంబానికో బెల్‌

ఈ ఫీచర్‌తో మీరు ఎక్కడ ఉన్నా మీరు మీ కుటుంబంతో కలిసి చేయాలనుకుంటున్న రోజువారీ కార్యక్రమాలను కుటుంబసభ్యులకు తెలియజేస్తుంది. అంటే మీరు రోజువారీ చేయాల్సిన పనులను మర్చిపోకుండా గుర్తుచేసే రిమైండర్‌లా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్యామిలీ బెల్‌ సెట్ చేయాలి. ఉదాహరణకు సెలవు రోజుల్లో చెట్లకు నీళ్లు పోయడం, ఫ్యామిలీని సినిమాకు తీసుకెళ్లడం, కలిసి భోజనం చేయడం వంటి వాటికి బెల్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీరు బెల్ చేసిన తేదీ, సమయం వచ్చినప్పుడు మీతోపాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఫోన్‌, హోమ్‌ స్పీకర్‌, స్మార్ట్ డిస్‌ప్లే లేదా నోటిఫికేషన్ల ద్వారా తెలియజేస్తుంది. రోజువారీ జీవితంలో బిజీగా గడుపుతూ కుటుంబం కోసం సమయం కేటాయించాలనుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

2. యాప్‌లకు విడ్జెట్స్‌

యాప్స్‌లో మనకు నచ్చిన సమాచారాన్ని సులువుగా చూసేందుకు విడ్జెట్స్‌ ఎంతో అనువైనవి. అందుకే గూగుల్ కొత్తగా మరో మూడు ఆండ్రాయిడ్ యాప్స్‌కు విడ్జెట్స్‌ను తీసుకొస్తుంది. వీటిలో గూగుల్ ప్లే బుక్స్‌, యూట్యూబ్ మ్యూజిక్‌, గూగుల్ ఫొటోస్‌ ఉన్నాయి. గూగుల్ ప్లే బుక్స్‌ విడ్జెట్‌ సాయంతో మీకు నచ్చిన పుస్తకాల జాబితాను సులువుగా రూపొందించి అవసరమైనప్పుడు చదవొచ్చు. ఇష్టమైన పాటలను యూట్యూబ్‌ మ్యూజిక్ హోమ్‌ స్క్రీన్‌ నుంచి విడ్జెట్‌లో పొందుపరచుకుని మీకు అవసరమైనప్పుడు వినొచ్చు. గూగుల్ ఫొటోస్‌ విడ్జెట్‌లో మీకు నచ్చిన వ్యక్తుల ముఖాలు లేదా మీరు తరచుగా చూడాలనుకునే వారి ముఖాలను వరుస క్రమంలో అమరిస్తే, విడ్జెట్ మీ హోమ్‌ స్క్రీన్‌ను ఎంతో ఆకర్షణీయంగా మారుస్తుంది. 

అలాగే, గూగుల్ ఫొటోస్‌లో పాత ఫొటోలు మెమొరీస్‌ పేరుతో యూజర్స్‌కు కనిపిస్తాయి. పండగలు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో మీరు తీసుకున్న ఫొటోలకు సంబంధించి కొద్ది రోజుల తర్వాత గూగుల్ మీకు నోటిఫికేషన్‌ పంపుతుంది. దానిపై మీరు క్లిక్ చేస్తే ఆయా సందర్భాల్లో మీరు స్టోర్‌ చేసుకున్న ఫొటోలు కనిపిస్తాయి. ఇప్పటికే ఈ ఫీచర్ పలువురు యూజర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయి యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.

3. మెసేజ్‌లకు స్మార్ట్ రిప్లై 

మీరు కారు డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంతలో మీ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. రిప్లై ఇవ్వాలంటే కారు పక్కకు ఆపి మెసేజ్‌ టైప్ చేయాల్సిందే. ఇక మీదట అలా చేయక్కర్లేదు అంటోంది గూగుల్. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మెసేజ్‌ వస్తే మీరు గూగుల్ అసిస్టెంట్ సాయంతో రిప్లై ఇవ్వొచ్చని తెలిపింది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఆటోలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. అలానే కారులో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన పాటలు వినేందుకు వాయిస్‌ సెర్చ్‌తో యాప్స్‌ నుంచి వెతికి వినొచ్చు. అంటే మీరు ఏదైనా మ్యూజిక్‌ యాప్‌ నుంచి ఫలానా సింగర్‌ పాట కావాలని వాయిస్‌ కమాండ్ ఇస్తే ఆండ్రాయిడ్ ఆటో దాన్ని ప్లే చేస్తుంది.

4. స్మార్ట్‌ఫోనే కారు తాళం

ఇకమీదట స్మార్ట్‌ఫోన్‌ను మీ కారు తాళంచెవిలా ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ను గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. దీని సాయంతో యూజర్స్‌ తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ నుంచి కారును లాక్‌ లేదా అన్‌లాన్‌ చేయొచ్చు. అంటే మీ స్మార్ట్‌ఫోన్‌ మీ కారు డిజిటల్ కీలా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ డిజిటల్‌ కీ గూగుల్ పిక్సెల్‌ 6, పిక్సెల్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌21 ఫోన్ల‌లో ఉంది. బీఎండబ్ల్యూ కారులను ఈ డిజిటల్‌ కీ సపోర్ట్ చేస్తుంది. 

5. భద్రత మరింత మెరుగ్గా

ఆన్‌లైన్ భద్రతపరంగా ఇదో మంచి ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. మన అవసరాల కోసం ఎన్నో రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తాం. వాటిలో రోజువారీ ఉపయోగించే యాప్‌లు కొన్నే ఉంటాయి. మిగిలినవి మనం ఎక్కువగా ఉపయోగించం. కానీ వాటిని ఇన్‌స్టాల్ చేసే సమయంలో మనం ఇచ్చిన అనుమతులతో కొన్ని యాప్‌లు ఫోన్‌ యాక్టివిటీని సదరు యాప్‌ డెవలపర్స్‌కు చేరవేస్తాయి. దీంతో మన గోప్యతకు భంగం కలగడంతోపాటు, మనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం సైబర్‌ నేరస్థుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. అందుకు గూగుల్ ‘రన్‌ టైమ్‌ పర్మిషన్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీని సాయంతో మీరు డౌన్‌లోడ్ చేసే యాప్‌లకు కొన్ని రోజుల వరకే అనుమతులు ఇవ్వొచ్చు. మీరు అనుమతించిన గడువు తేదీ ముగిసిన వెంటనే యాప్‌లకు మీరు ఇచ్చిన అనుమతులు డిసేబుల్ అవుతాయి. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్‌ నుంచి ఆపై వెర్షన్‌ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది.

6. నచ్చిన ఎమోజీ చేసేయొచ్చు

మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఎమోజీలతో చెప్పొచ్చు. అందుకే ఎమోజీలకు డిమాండ్ ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకునే గూగుల్ ఎమోజీ కిచెన్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్‌ కోసం తీసుకొస్తుంది. దీని సాయంతో యూజర్స్‌ ఒక ఎమోజీ రియాక్షన్‌ను మరో ఎమోజీకి జోడించి కొత్త ఎమోజీని రూపొందించవచ్చు. ఉదాహరణకు మీకు స్మైల్ ఎమోజీ నచ్చిందనుకుందాం. దాన్ని మీరు హార్ట్ సింబల్‌ ఎమోజీకి జోడిస్తే మీకు హార్ట్‌ సింబల్‌ నవ్వుతున్నట్లు కొత్త ఎమోజీ తయారవుతుంది. అలాగే, మీకు నచ్చినట్లుగా వివిధ రకాల ఎమోజీలను రూపొందించవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags